కూకట్ పల్లి (జనంసాక్షి ): వినాయక నవరాత్రి ఉత్సవముల సందర్భంగా బుధవారం పోలీస్ ఇన్స్పెక్టర్ పి. సైదులు షిర్డీ హిల్స్ లో ఏర్పాటుచేసిన గణపతి మండపంలో వినాయకుడిని దర్శించికొని ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సైదులు మాట్లాడుతూ అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని అన్నదాన కార్యక్రమం నిర్వహించిన వారికి అష్టఐశ్వర్యాలు కలగాలని సర్వ విఘ్నాలను అధిగమించి, జయమును కలగాలని, వినాయకుడి ఆశీర్వాదములతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో షిర్డీ హిల్స్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
గణనాధుని ప్రత్యేక పూజలో ఇన్స్పెక్టర్ పి.సైదులు




