మోమిన్ పేట జూన్ 15 జనం సాక్షితెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి ముఖ్య కారణం ఉత్తమ కెసిఆర్ అని జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు బుధవారం వికారాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు వికారాబాద్ మండల పరిధిలోని కామారెడ్డి గూడ లో 20 లక్షల నిధులతో నూతన గ్రామపంచాయతీ కార్యాలయం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, గ్రామంలో 30 లక్షల నిధులతో వేసిన నూతన సీసీ రోడ్లను ప్రారంభించారు.మోమిన్ పేట్ మండల పరిధిలోని గోవిందాపూర్ గ్రామంలో 20 లక్షల నిధులతో నూతన గ్రామపంచాయతీ కార్యాలయం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి 35 లక్షల నిధులతో నూతనంగా వేసిన సీసీ రోడ్లను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్యమ్మ సాయన్న ఎంపీపీ వసంత మార్కెట్ కమిటీ చైర్మన్ పటేల్ శ్రీకాంత్ గౌడ్ పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు డి వెంకట్ దళిత రత్న అవార్డు గ్రహీత బుచ్చయ్య ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
గణనీయంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”




