నారాయణఖేడ్ ఆగస్టు26(జనంసాక్షి)
నారాయణఖేడ్ పట్టణంలోని షెట్కార్ ఫంక్షన్ హాల్లో రానున్న గణపతి నవరాత్రులను దృష్ట ప్రభుత్వం తరఫున పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి
అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ శాంతిభద్రతలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసే గణనాథుల మండపాలను ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పోలీస్ శాఖను కోరారు. భిన్నత్వంలో ఏకత్వం గల ఈ భారత ఖండంలో మత సామరస్యం తో మన ప్రాంతంలో గణపతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకోవాలని ఉత్సవ కమిటీలను, ప్రజలకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ మండలాల జడ్పిటిసిలు,ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఎంపీటీసీల, సర్పంచులు,కౌన్సిలర్లు, పార్టీ వివిధ హోదాల్లో గల ప్రజా ప్రతినిధులు నాయకులు,ఆర్డీఓ, పోలీసు శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది,ప్రజలు, నియోజకవర్గ యువత పాల్గొన్నారు.




