- ఫోటో రైటప్: కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న ప్రెస్ క్లబ్ సభ్యులు.
బెల్లంపల్లి, ఆగస్టు27, (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని ప్రెస్ క్లబ్ మొదటి వార్షికోత్సవాన్ని అధ్యక్షుడు పులియాల రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పులియాల రాజు మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ ప్రారంభించి ఏడాది గడిచిందని, జర్నలిస్టుల ఐక్యతకు పాటు పడి మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ప్రెస్ క్లబ్ నాయకులు వల్లభాయ్, తిరుపతి, ప్రభాకర్, లక్ష్మణ్, నగేష్, వికాస్, శివ, వెంకట్, శ్రీనివాస్, అనుదీప్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




