మునగాల,జులై21 (జనంసాక్షి)
హైదరాబాద్ రవీంద్ర భారతిలో బుధవారం రాష్ట్ర గవర్నర్ డా. తమిళి సై సౌందరరాజన్, వీసీ టి. కిషన్ రావు చేతుల మీదిగా మునగాల మండలోని గణపవరం గ్రామానికి చెందిన డాక్టర్ నాగజాను సూరేపల్లి, తూమాటి ద్రోణప్ప స్వర్ణ పతకం అందుకున్నారు. గ్రామనికీ చెందిన సూరేపల్లి రాములు -వెంకమ్మల కుమారుడు డా. నాగజాను సూరేపల్లి తెలుగు యూనివర్సిటీ జానపద గిరిజన పీఠం వరంగల్ లో యూనివర్సిటీ రిజిస్ట్రార్, డాక్టర్ భట్టు రమేష్ గారి పర్యవేక్షణ లో “తెలంగాణ ప్రాంత గిరిజన చిత్రకళ “అనే అంశంఫై పరిశోధ న చేసిన పీహెచ్డీ అంశంకు బంగారు పతకం లభించింది.15వ స్నాతకోత్సవంలో భాగంగా ఈ నెల 20 తారీకు రవీంద్ర భారతిలో జరిగిన ఓ కార్యక్రమం లో డాక్టర్ నాగజాను సూరేపల్లి స్వర్ణ పతకాన్ని అందుకున్నారు.
ప్రాధమిక విద్య గ్రామం లో,6-10 తరగతి వరకు భువనగిరి గురుకులంలో, ఇంటర్ నడిగూడెం ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో, డిగ్రీ, పీజీ, యం.ఫీల్ తెలుగు యూనివర్సిటీ జానపద శాఖలో ..చిగిచెర్ల క్రిష్ణ రెడ్డి పర్యవేక్షణ లో “తెలుగు జానపద చిత్రకారులు -కొండపల్లి శేషగిరి రావు ప్రత్యేక త “అనే అంశం కు 2018 సంవత్సరం 14 వ స్నాతకోత్సవంలో గవర్నర్ ఇ.ల్.న్. నర్సింహాన్ చేతుల మీదిగా శ్రీ బోప్పన్న స్వర్ణ పతకం అందుకున్నాడు. యం. ఫ్. ఏ (కళల చరిత్ర ) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో,
2019 లో దేశ వ్యాప్తగా జరిగిన యు.జి. సి -నెట్ అర్హత సాదించినాడు. పీజీ. డిప్లొమా -ఇంగ్నో ఢిల్లీ నుంచి పూర్తి చేసినన్నాడు. డాక్టర్. నాగజాను సూరేపల్లి చిన్న తనములోని తండ్రి మరణించడంతో తల్లి వెంకమ్మ ఒంటరిగా కష్టంపడి చదివించింది. గణపవరం గ్రామానికి విద్యావేత్తగా ఆదర్శ వ్యక్తిగా యం.ఫీల్ మరియు పీహెచ్డీ కి స్వర్ణ పతకం సాధించడంతో గురువులు, బంధువులు, ప్రజాప్రతినిధులు అభినందించినారు.
Attachments area




