నిరుపేద మహిళకు ఆర్థిక సాయం
వరంగల్ ఈస్ట్ జూలై 21(జనం సాక్షి):
లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో గురువారం అనారోగ్యంతో బాధపడుతున్న రామన్నపేటకు చెందిన నిరుపేద మహిళ రేణుకుట్ల వీరలక్ష్మి కి 5000/- రూ. ఆర్థిక సహాయాన్ని అందజేసిన స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన లయన్స్ క్లబ్ జిల్లా 320 గ్లోబల్ సర్వీస్ టీం కోఆర్డినేటర్ డా. తాళ్ల రవి మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా లయన్ మెంబర్స్ ముందజలో వుంటారనీ అన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు అప్పరాజు రాజు,కార్యదర్శి మాడిశెట్టి నరహరి, కోశాధికారి గండేటి రమణయ్య, ఉపాధ్యక్షులు ఉదయ్ భాస్కర్, రావుల భాను, సెక్రటరీ రాజు, తదితరులు పాల్గొన్నారు.
Attachments area