లాంఛనంగా ప్రారంభించిన మంత్రి
హైదరాబాద్,జూన్4(జనం సాక్షి ): తెలంగాణా రాష్ట్రంలోనే ప్రపథమంగా సికింద్రాబాద్ గణెళష్ దేవాలయంలో ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రెండు శతాబ్దాల ఘన చరిత్ర ఉన్న పురాతన దేవాలయంలో పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ బుకింగ్ సేవలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. సికింద్రాబాద్ గణెష్ ఆలయంలో నూతనంగా ప్రవేశ పెట్టిన ఆన్‌లైన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భక్తులకు సూచించారు. ఇకనుంచి రోజువారీ పూజలు, ప్రత్యేక సేవలు, ప్రసాదం ఆన్‌లైన్ లో బుక్ చేసుకోవచ్చని తెలిపారు. సికింద్రాబాద్ గణెళిష్ దేవాలయంలో నిత్య కల్యాణం, గణపతి ¬మం సేవలను ఆన్‌లైన్ లో బుక్ చేసుకోవచ్చన్నారు. టీటీడీ తరహాలో నూతన సాంకేతికతో భక్తులకు ఆన్‌లైన్ సేవలు అందించేందుకు తెలంగాణ దేవాదాయ శాఖ చర్యలు తీసుకుందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రసిద్ధ దేవాలయాల్లో భక్తుల రద్దీ పెరిగిందని, ఆలయాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎన్నో కార్య క్రమాలు అమలు చేస్తున్నామన్నారు. భక్తులకు అసౌకర్యంకలగకుండా క్యూలైన్ల క్రమబద్దీకరణతో పాటు సేవాటికెట్లు, వసతి గృహాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నామన్నారు. రెండో దశలో తెలంగాణాలోని యాదాద్రి, బాసర, వేములవాడ, భద్రాచలం దేవాలయాల్లో కూడా ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు.




