లాంఛనంగా రోబోటిక్ కెమెరాల ప్రారంభం
హైదరాబాద్,జూన్4(జనం సాక్షి ): వాటర్ బోర్డులో చాలా మార్పులు చేస్తున్నామని, విషవాయువులు గుర్తించే కొత్త టెక్నాలజీని తీసుకొచ్చామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అలాగే క్లీనింగ్‌లో కూడా మనుష్యుల ప్రమేయం తక్కువగా ఉండేలా చూస్తున్నామని అన్నారు. డ్రైనేజీ పైపులు, నాలాల్లో అడ్డుపడ్డ చెత్తను గుర్తించే 360 డిగ్రీల రోబోటిక్ కెమెరాలను సోమవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మ్యాన్¬ల్స్‌ను ఎవరైనా ఓపెన్ చేస్తే వెంటనే గుర్తించేలా ప్రణాళికలు తయారు చేస్తామని అన్నారు. హైదరాబాద్‌లో తాగునీరు, మురుగునీరు పైపులకు సంబంధించిన సమాచారం లేదని, జీఐఎస్ సిస్టమ్ తయారు చేయాలని ఆదేశించామని చెప్పారు. బ్యాంకాక్‌లో మాదిరిగా వర్టికల్ ఎస్టీపీలు కట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. భూగర్బ మురుగు నీటి పారుదల పైపుల శుద్ధి కోసం రోబోటిక్స్ విధానాన్ని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో రోబోటిక్స్ విధానం గురించి మంత్రికి అధికారులు వివరించారు. ఈ రోబోటిక్స్ డ్రైనేజ్ విషవాయువులను గుర్తించనున్నాయి. డ్రైనేజ్ పైపులు, నాలాల్లో అడ్డుపడిన చెత్త గుర్తించే 360 డిగ్రీ రోబోటిక్ కెమెరాలను కేటీఆర్ లాంచ్ చేశారు.




