Tuesday, 3 November 2026

గణేష్‌ శోభాయాత్రపై పోలీసు డేగకన్ను

 హైదరాబాద్‌ సిటీ : గణేష్‌ నవరాత్రుల ను భక్తులు ఆనందంగా జరుపుకునేందుకు పోలీసులు ఈ ఏడాది కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. శోభాయాత్ర మార్గంలో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుం డా కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. గతంలో ట్రాఫిక్‌ పో లీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారానే పర్యవేక్షణ జరిగింది. ఈ ఏడాది ప్రత్యేకంగా పోలీసులు ప్రతి అంగుళం కనిపించేలా కెమెరాలు ఏర్పాట్లు చేశారు. పోలీసు అధికారులు షిఫ్ట్‌లవారీగా కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఖైరతాబాద్‌ భారీ గణేష్‌ను మొదటిసారిగా పోలీస్‌ కమిషనరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూం పరిధిలోకి తెచ్చా రు. నగరంలో శోభాయాత్ర బయలుదేరే బాలాపూర్‌ చెరువు నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు 13 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ మార్గంలోనే ఈనెల 27న గణేష్‌ శోభాయాత్ర జరగనుంది. ఇప్పటికే ఈ మార్గంలో ట్రాఫిక్‌ ఫోలీసులు 37 సీసీ కెమెరా లు అమర్చారు. ఈ 13 కిలోమీటర్లలో ప్రతి అంగుళాన్ని పరిశీలించడానికి ఈ కెమెరాలు చాలనందున 300 కెమెరాలను అదనంగా పోలీసులు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కిలోమీటర్‌ దూరం వరకు జామ్‌ చేసి క్షుణ్ణంగా పరిశీలించొచ్చు.పోలీస్‌ కమిషరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూంలో వీడియోవాల్‌ని ఏర్పాటు చేశారు. నగరంలో అన్ని కెమెరాల వీడియోని ఒకేసారి దీనిలో చూడగలిగే సామర్థ్యం ఉంది. దృ శ్యం క్లియర్‌గా కనిపించేందుకు 36 ఫ్రేమ్‌ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఈ టెక్నాలజీని పోలీస్‌ ఐటీ సెల్‌ ఇన్‌చార్జి శ్రీనాథ్‌ రెడ్డి పర్యవేక్షిస్తుండగా, కెమెరాల ఆపరేటింగ్‌ను సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌డ్‌ అడిషనల్‌ డీసీపీ రవికుమార్‌ పర్యవేక్షిస్తున్నారు. కుత్బుల్లాపూర్‌ : వినాయక నిమజ్జనానికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సి.వి.ఆనంద్‌ అన్నారు. మంగళవారం కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌లోని సూరారంకాలనీ లింగంచెరువు, జీడిమెట్ల ఎన్నాచెరువుల వద్ద ఆయ న ఏర్పాట్లను పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *