హైదరాబాద్, ఈ నెల 25 శుక్రవారం బక్రీద్ పురస్కరించుకుని ఉమ్మడి హైకోర్టుకు, ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లోని కింది కోర్టులకు, ట్రిబ్యునల్స్, ఇతర జ్యుడీషియల్ సంస్థలకు సెలవు ప్రకటించారు. పరిపాలనపరమైన కారణాలవల్ల నవంబర్ 7వ తేదీ శనివారం హైకోర్టు పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ర్టార్ జనరల్ పేరిట మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.




