Wednesday, 4 November 2026

*గణేష్ ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి*

*దోమ ఎస్ఐ విశ్వజన్*

దోమ ఆగష్టు 28(జనం సాక్షి)
దోమ మండలంలోని ప్రజలు వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్ ఐ విశ్వజన్ తెలిపారు. గ్రామాల్లో మండపాలు ఏర్పాటు కోసం పోలీస్ స్టేషన్ లో అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ నెల 31న నాయక చవితి సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారు ఏర్పాటు చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ లో అనుమతులు పొందాలని ఆయన తెలిపారు. ముఖ్యంగా విగ్రహ ఏర్పాటుదారులు అధికారులు నిర్దేశించిన నిబంధనల మేరకు నడుచుకొని వినాయక చవితిని జరుపుకోవాలని ఆయన సూచించారు. వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే మండపాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విగ్రహ ప్రతిష్ట నాటి నుంచి ఎన్ని రోజుల పాటు పూజలు జరుపుతున్నారు నిమజ్జనం  కార్యక్రమం ఎప్పుడు ఎక్కడ నిర్వహిస్తారో వాటికి సంబంధించిన వివరాలు పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు. మండల ప్రజలు శాంతిభద్రతను సహకరించాలని నిబంధనలను విరుద్ధంగా ఎవరైనా విగ్రహాలు ఏర్పాటు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.