పేదల పక్షపాతి సీఎం కేసిఆర్
సమిష్టి కృషితో గట్టు ను గట్టెకిదాం కెసిఅర్ చిత్రపటాన్ని కి పాలభిషేకం
పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు జడ్పిచైర్మెన్ సరిత తిరుపతయ్య యంయల్ఏ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
అగస్టు 28 (జనంసాక్షి) గట్టు
రాష్ట ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉంది
ఎమ్మేల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గట్టులో కొత్త ఆసరా పెన్షన్ పంపిణీ ప్రారంభం గద్వాల నియోజకవర్గంలో గట్టు మండలం కేంద్రంలో మండలం పరిషత్ కార్యాలయం ఆవరణలో కొత్త ఆసరా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎం.పి పోతుగంటి రాములు , గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమెహన్ రెడ్డి జెడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్యబ హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ 57 సంవత్సరాలు నిండిన వారికి రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పది లక్షల పింఛన్లను మంజూరు చేయడం జరిగింది.ఎం.పి ,ఎమ్మెల్యే జడ్పిచైర్మెన్ చేతుల మీదుగా గట్టు మండలానికి సంబంధించిన 1360మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన ఆసరా పెన్షన్ కార్డులు అందజేశారు.
కెసిఆర్ చిత్రపటానికి ఎం.పీ, ఎమ్మెల్యే తో కలిసి లబ్ధిదారులు పాలాభిషేకం ఛేశారు గత ప్రభుత్వాలలో తెలంగాణ రాష్ట్రంలో గట్టు మండలం అక్షరాస్యతలో ఆసియా ఖండంలోని వెనుకబడిన ప్రాంతంగా ఉండేది కానీ నేడు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో విద్యరంగానికి పెద్దపీట వేయడం జరిగినది అనిఅన్నారు కెసిఆర్ దైవాంసా సంబోధుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిరుపేదల సంక్షేమం కోసం అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దైవంశ సంభూతుడుగా అని ఎంపీ నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు పేర్కొనారు గతంలో గద్వాల ప్రాంతంలో కరువు కాటకాలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వెనుక పడే ప్రాంతంగా ఉండేది ఈప్రాంతాల నుండి వివిధ ప్రాంతాలకు వలసలుగా వెళ్లేవారు అదేవిధంగా ప్రతిరోజు దినపత్రికలు చూచితే హత్య రాజకీయాలు గద్వాలలో హత్యలు జరిగినయని వార్తలు వచ్చేవి అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో గద్వాల ఎమ్మెల్యే సారథ్యంలో గద్వాల ప్రాంతం గట్టు మండలంఆబివృద్ది అవుతుంది ఎటు చూసినా పచ్చని చెట్లతో గ్రామాలలో ప్రశాంతమైన వాతావరణం ప్రతి ఒక్కరు గ్రామాలలో అభివృద్ధి వైపు గా చెందే విధంగా రైతులకు పని కలిగే విధంగా వారికి సాగునీరు అందజేస్తూ రెండు పంటలకు రైతులు పండించుకునే విధంగా అన్ని విధాలుగా రైతుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది ప్రజలందరూ అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు
ప్రతి ఆడ బిడ్డకు కేసిఆర్ ఒక ఒక కొడుకుల ఒక అన్నల అండగా ఉన్నారు ఇదేవిధంగా కేసీఆర్ ను భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు.
ఎమ్మెల్యే మాట్లాడుతు
గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చేయలేని విధంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పనులు చేసి ప్రజలకు చూపించడం జరిగిందనిఅనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఎలాంటి మధ్యవర్తి లేకుండా నేరుగా ప్రజలకు లబ్ధి పొందే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు
గద్వాల నియోజకవర్గం లో 7వేలు పైగా, గట్టు మండలం లొ 1360 కొత్త ఆసరా పింఛన్లు, ఇచ్చిన ఘనత కేవలం సీఎం కేసీఆర్ సర్కారు టీఆర్ఎస్ ప్రభుత్వానికె చెల్లిదన్నారు
గత పాలించిన ప్రభుత్వాల టీడీపీ హయాంలో రూ.50 ఫించన్లు, కాంగ్రెస్ హయాంలో రూ.200 ఉండేవని, పింఛన్లు ఇచ్చే దాక ఉంటారా చస్తారో. తెలిసేది కాదని గత ప్రభుత్వాల హయాంలో జరిగిన తీరును విమర్శించారు తెలంగాణ రాష్ట్రం వచ్చాక కన్న కొడుకులా రాష్ట్రానికే కాకుండా ఆసరా పింఛన్ ఇంటికి పెద్ద కొడుకులా సీఎం కేసీఆర్ రూ.2016 ఆసరా పింఛన్లు, వికలాంగులకు 3016 రూపాయలు, ఒంటరి మహిళలకు, అలాగే కొత్తగా డయాలసిస్ పేషెంట్లకు కూడా పింఛన్లు 2016 ఇవ్వడం మన అదృష్టం అని పేర్కొన్నారు
ఇంకా ఎవరైనా మిగిలితే అర్హులైన వారందరికీ త్వరలో వారికి కూడా పింఛన్లు వచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు.
అదేవిధంగా ఈ నెల నుంచి చేనేత కార్మికుడు మృతి చెందితే.. రూ.5లక్షల భీమా వర్తించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది అన్నారు
గట్టు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి త్వరలోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు రైతులకు రెండు పంటలకు నీళ్లు చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందజేసే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు
టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సమానం చేస్తూ గ్రామాలన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నాయి అన్ని గ్రామాలలో వైకుంఠ ధాములు, డంపింగ్ యార్డులు, ప్రకృతి వనం, ఏర్పాటుచేసి గ్రామాలలో అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది త్వరలోనే గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యం కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, జెడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ, ఎంపీపీ విజయ్ కుమార్ జెడ్పిటిసి లు బాసు శ్యామల రాజశేఖర్ వైస్ ఎంపీపీ సుమతి, PACS ఛైర్మన్ వెంకటేష్, జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ్, మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడు హనుమంతు నాయుడు, గట్టు మండలం పార్టీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు, సింగల్ విండో డైరెక్టర్స్, అధికారులు, తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.