ఎస్ఐ జి. నవీన్ కుమార్ .మల్లాపూర్ (జనంసాక్షి) ఆగస్టు 28: మల్లాపూర్ మండల పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని , ముందస్తుగా కమిటీని ఏర్పాటు చేసుకోని పోలీసు వారు జారీ చేసిన ప్రభుత్వ వెబ్ సైట్ https : //policeportal.tspolice.gov.in. దరఖాస్తు చేసుకోవాలని మల్లాపూర్ మండల ఎస్పై జి. నవీన్ కుమార్ కోరారు . పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ … బుధవారం నుండి మండలంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఉత్స వ కమిటీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు . ఉత్సవా లకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా కట్టు దిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు . ప్రతి ఉత్సవకమిటీ వారి విగ్రహాల ఏర్పాటుకు గ్రామపంచాయతీ అనుమతి , విద్యుత్ కనెక్షన్ కొరకు విద్యుత్ శాఖ వారి అనుమతి , అదేవిధంగా ఏదైనా ఇతర స్థలాలలో విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు ఆ స్థలం వారి అనుమతి తీసుకోవాలని ఆయన అన్నారు . ప్రత్యేకంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా వచ్చే పోయే రహదారి వాహనాలకు అంతరాయం కలగకుండా రోడ్ల పైన విగ్రహాలను ఏర్పాటు చేయకుండా విశాలమైన ప్రదేశాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు . ప్రతి ఒక్కరూ ఏ ఏ ప్రదేశాల్లో విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారో తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్లో తప్పకుండా సమాచారం అందించాలన్నారు .
గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలి




