ఫోటోగ్రాఫర్ ఐక్యత వర్ధిల్లాలి

జనం సాక్షి కదలాపూర్
కథలాపూర్ మండల ఫోటోగ్రాఫర్లు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి ఫోటోగ్రాఫర్లు ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ తమ ఉనికిని చాటుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు జక్కని గంగ ప్రసాద్ మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్లు రాత్రింబవళ్లు కష్టపడి పెండ్లికి ఫోటోలు తీస్తే వాటిని కస్టమర్లు ఆన్లైన్లో పంపించుకుని, గిఫ్ట్ ఆర్టికల్ లో అతి తక్కువ చేపిస్తున్నారని బాధపడ్డారు. దీనిని వెంటనే అరికట్టాలని మండలంలోని అన్ని గిఫ్ట్ ఆర్టికలలో తమ యొక్క ధరలను మీరు కూడా తీసుకోవాలని తెలిపారు, ప్రతి ఒక్కరు తమకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు తూర్పాటి రాజేష్, ప్రసాద్, విశ్వనాథం, రామ్మోహన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు