కార్పొరేష /కొత్తపల్లి, జనంసాక్షి: ఒకప్పుడు శనివారం వచ్చిదంటే చాలు నగరంలోని గాంధీరోడ్డులో ఎక్కడ లేని సందడి ఉండేది. అక్కడ నిర్వహించే సంతలో దొరకని వస్తువంటూ ఉండకపోవడంతో జనం తండోపతండాలుగా వచ్చేవారు. కానీ అధికారుల నిర్లక్ష్యంతో నేడు ఆ సంత కళ తప్పుతోంది. అయితే ప్రస్తుతం నగరంలో ఎన్నో బ్రాండెడ్ షోరూంలు , వివిధ కంపెనీలకు చెందిన అవుట్‌పూట్స్, భారీ షాపింగ్ మాల్స్ విస్తరించినప్పటికీ సామగ్రి కొనుగోలుకు కొందరు సంతకు వస్తున్నారు. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి వచ్చే వ్యాపారులు, కొనుగోలుదారులతో ఇప్పటికీ సందడిగానే కనిపిస్తోంది. అయితే జిల్లా అధికారులు , నగరపాలక అధికారులు మాత్రం ఇటువైపు కన్నెత్ని చూడ కనీస సదుపాయాలు కల్పించడంపై అధికారులు ఏ రోజూ దృష్టిపెట్టలేదు. 50ఏళ్ల కిందట ప్రభుత్వ స్థలంలో ప్రారంభమైన ఈ సంతపెద్ద ఎత్తున సాగేది. రైతుబజార్ , నేత బజార్ నుంచి ఇటుతీరందాజ్ థియేటర్ దాకా గాంధీరోడ్డు వరకు విస్తరించేది. మెట్‌పల్లి , సిరిసిల్ల, పెద్దపల్లి, మంథని, హుజూరాబాద్, జమ్మికుంట నుంచి పలు రకాల వ్యాపారులు పెద్దసంఖ్యలో సంతకు తరలివచ్చేవారు. కానీ విస్తరిస్తున్న నగరంతో పాటుగా ప్రభుత్వం వివిధ అవసరాల పేరిట ఆయా సంస్థలకు ఈస్థలాలు కేటాయిస్తూ రావడంతో ప్రస్తుతం ఈ సంత కేవలం రెండు రోడ్లకే పరిమితమైంది. దీంతో జిల్లాలోని చిరు వ్యాపారులకు ఉపాధి కరువవుతోంది. ఇకనైనా అధికారులు సంతకు పూర్వ వైభవం తీసుకురావాలని వ్యాపారులు కోరుతున్నారు. ప్రత్యేకాధికారులుగా పంచాయతీ కార్యదర్శులు
హుజూరాబాద్, జనంసాక్షి: ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మార్పు’ కార్యక్షిక్షమం విజయవంతానికి ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులను ప్రత్యేకాధికారులుగా నియమించనుందని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. మండలకేంవూదంలో మార్పు కార్యక్షిక్షమంపై శనివారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇందుకు సంబంధించిన అనుమతులు పూర్తయ్యాయని, ఒకటి, రెండ్రోజుల్లో ఉత్తర్వులు కూడా రావొచ్చని చెప్పారు. గర్భిణీల, పిల్లల సంక్షేమం కోసం చేయాల్సిన అన్ని పనుల్లో ఇక పంచాయతీ కార్యదర్శులదే కీలకపాత్ర ఉంటుందని తెలిపారు. అనంతరం గ్రామాల్లో పరిశువూభత కోసం కార్యదర్శులు ఏం చేస్తున్నారని ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు.




