Wednesday, 4 November 2026

గద్దర్ మరణం తెలంగాణ ప్రజలకు తీరని లోటు – ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు

 జనంసాక్షి, మంథని : ప్రజా గాయకుడు గద్దర్ మరణం తెలంగాణ ప్రజలకు తీరని లోటు ఏఐసీసీ సెక్రెటరీ ,మాజి మంత్రి మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. ఎల్బీ స్టేడియంలో గద్దర్ పార్థివదేహం వద్ద ఆయన నివాళులు అర్పించారు. గద్దర్‌ మృతి చాలా బాధాకరం అని ప్రజా గొంతుక మూగబోయింది అని శ్రీధర్ బాబు అన్నారు.