తల్లిపాలు అంటేనే అమృతం – సూపర్వైజర్ విజయలక్ష్మి
అశ్వారావుపేట, ఆగష్టు 7( జనం సాక్షి ) తల్లిపాలు అంటేనే అమృతం అని సూపర్వైజర్ విజయలక్ష్మి సూచించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా అశ్వారావుపేట మండలంలోని నందమూరి నగర్ అంగన్వాడి సెంటర్లో గర్భవతులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ విజయలక్ష్మి మాట్లాడుతూ… తల్లిపాలు బిడ్డకు పట్టించటం తల్లులు బాధ్యతగా తీసుకోవాలన్నారు. తల్లిపాలు వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని తెలిపారు. పుట్టిన బిడ్డకు వెంటనే ముర్రిపాలు తాగించాలని తల్లులను ఆమె కోరారు . ముర్రిపాలు పట్టించడం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అన్నారు. తల్లిపాలు ప్రాముఖ్యతను గురించి తల్లులకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఏ సి డి పి ఓ మహబూబ్ ఆరి, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, సర్పంచ్ అట్టం రమ్య, అంగన్వాడి టీచర్లు విజయ కుమారి, వార్డు సభ్యులు ఉదయ్ ఆశ కార్యకర్త ఝాన్సీ తల్లులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.