Monday, 2 November 2026

గన్‌పార్క్ వద్ద విపక్షాల ఆందోళన…అరెస్ట్

హైదరాబాద్,  : తెలంగాణ శాసనసభ వాయిదా పడిన అనంతరం గన్‌పార్క్ వద్ద విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. రైతు సమస్యలపై స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా సభను అర్ధాంతరంగా వాయిదా వేశారని వారు మండిపడ్డారు. రైతు రుణాలను ఏకపక్షంలో మాఫీ చేయాలంటూ  విపక్షాలు డిమాండ్ చేశాయి. టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళన చేస్తున్న విపక్ష ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *