Thursday, 5 November 2026

గర్భిణీ లు పోషకహారం తీసుకోవాలి

మరిపెడ, సెప్టెంబర్ 14(జనం సాక్షి ):గర్భిణులు, బాలింతలు,పిల్లలు తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని  ఎంపీపీ గుగులోతు అరుణ రాంబాబు అన్నారు.  మండలంలోని తండా ధర్మారం గ్రామ  పంచాయతీలోని అంగన్‌ వాడీ కేంద్రం లో బుధవారం ‘పోషణ్‌ మాసం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ లా ద్వార పోషకహారం అందించడం జరుగుతుందాని దానిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుగులోత్ వెంకన్న, సర్పంచ్ లు లక్ష్మి లక్పతి,భిక్కు,అంగన్వాడి టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.