హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన గల్ఫ్ బాధితులను దశలవారిగా హైదరాబాద్‌కు చేరుస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. వీసా గడువు ముగిసిపోయి దుబాయి జైళ్లలో మగ్గుతున్న బాధితులను సైతం విడిపించి స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వెల్లడించారు. దుబాయి నుంచి హైదరాబాద్ వచ్చిన 17 మంది గల్ఫ్ బాధితులను పరామర్శించేందుకు ఈ ఉదయం శ్రీధర్‌బాబు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. గల్ఫ్‌లో చిక్కుకున్న దాదాపు 1000 మంది బాధితులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఇప్పటికే అధికారుల బృందాన్ని దుబాయికి పంపించినట్లు తెలిపారు.




