Wednesday, 4 November 2026

గాంధీజీ జయంతి రోజున బాపూజీని స్మరించుకోవడం మనందరి బాధ్యత కార్పొరేటర్లు

అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 2
 గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ సేవలను అల్వాల్ మచ్చ బొల్లారం డివిజన్ల కార్పొరేటర్ లు చింతల విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి. రాజ్ జితేందర్ నాథ్ స్మరించుకున్నారు. జాతిపిత మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా గాంధీ 153 వ జయంతి సందర్భంగా అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ మాత్మ గాంధీ నగర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. కార్పొరేటర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో సత్యం అహింస మార్గం పెంచుకొని మనందరి స్ఫూర్తిదాయకంగా నిలిచారని కార్పొరేటర్ కొనియాడారు. గాంధీజీ బోధనలు ప్రపంచ నాయకులకు
స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, ఉదయ్ కుమార్, శ్రీశైలం యాదవ్, నాగేశ్వరరావు, బలవంత రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శ్రావణ్ కుమార్, వెంకటేష్, సూర్య కిరణ్, శోభన్ బాబు, రాజసింహారెడ్డి, అరవింద్, రమ, రమేష్, ప్రేమ్, ప్రవీణ్, మధు, దేవా, సరిత, సంజీవ, సులోచన, రమేష్ యాదవ్, శంకర్, నవీన్ కాలనీ అధ్యక్షులు నరహరి, నరేందర్ సింగ్, చారి, నరేష్, చిన్నయ్య, సతీష్, తదితరులు పాల్గొన్నారు.