Thursday, 5 November 2026

గాంధీభవన్‌ వద్ద సడలని ఉద్రిక్తత

ఇద్దరు కార్యకర్తల ఆత్మహత్యాయత్నం

అడ్డుకున్న తోటి కార్యకర్తలు

గృహనిర్బంధంలో జూబ్లీహిల్స్‌ టిఆర్‌ఎస్‌ నేత

హైదరాబాద్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి): తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీల్లో టికెట్ల కేటాయింపుపై సొంత పార్టీ నేతల్లోనే అసమ్మతి భగ్గుమంటోంది. తాజాగా తెరాస నేత, ఉద్యమకారుడు ఇంద్రకుమార్‌ తన నిరసన గళం విన్పించారు. తమస్థానాల్లో ఇతరలుకు టిక్కెట్లు ఇస్తున్నారన భావనతో ఆందోళనకు గురైన పలువురి మద్దతుదారులతో గాంధీభవన్‌ ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్టీ టికెట్‌ దక్కని అసంతృప్త నేతలు తమ క్యారకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. ఉప్పల్‌ టికెట్‌ను రాగిడి లక్ష్మారెడ్డికే ఇవ్వాలంటూ ఇద్దరు కార్యకర్తలు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. అసంతృప్త నేతల ఆందోళనలతో గాంధీభవన్‌ పరిసరాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. అసంతృప్త నేతలకు సర్దిచెప్పేందుకు పార్టీ సీనియర్లు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు మల్కాజ్‌గిరి టికెట్‌ నందికంటి శ్రీధర్‌కు ఇవ్వాలని ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. ఖానాపూర్‌ టికెట్‌ను రమేష్‌ రాథోడ్‌కు ఇవ్వొద్దంటూ కాంగ్రెస్‌ కార్యకర్తల నిరసన చేపట్టారు. నకిరేకల్‌ టికెట్‌ను ప్రసన్న రాజుకు ఇవ్వాలంటూ ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. జూబ్లీహిల్స్‌ స్థానం నుంచి మాగంటి గోపీనాథ్‌కు కేటాయించడంపై నిరసన వ్యక్తంచేశారు. గోపీనాథ్‌ అభ్యర్థిత్వాన్ని మార్చాలని డిమాండ్‌ చేస్తూ స్వీయ గృహ నిర్బంధం చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకుంటానంటూ ఇంట్లో పెట్రోల్‌ సీసాతో ఇంట్లో స్వీయ నిర్బంధం చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇంద్రకుమార్‌ను బయటికి తీసుకొచ్చేందుకు పోలీసులు, కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు.