సికింద్రాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు బుధవారం ధర్నాకు దిగారు. ఆనాధ శవాలను అమ్ముకుంటున్న ప్రొఫెసర్‌పై చర్య తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. గాంధీ మెడికల్ కాలేజీలో ఫోరెన్సిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ప్రోఫెసర్ జయరాజ్ అనాథ శవాలతో వ్యాపారం చేస్తున్నారంటూ జూడాలు నిన్న డైరుక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి డాక్టర్ జయరాజ్ ఓ శవం అమ్మేందుకు ప్రైవేట్ వ్యక్తులతో మాట్లాడుతోన్న ఆడియో రికార్డింగులను జూనియర్ డాక్టర్ల విడుదల చేశారు.




