సుదర్శన్ :శామీర్ పేట్, జనం సాక్షి :
శామీర్ పేట లో గాంధీ జయంతి సందర్భంగా శామీర్ పేట గ్రామ పంచాయతీ వద్ద గాంధీ మహాత్ముని విగ్రహానికి పార్టీల కతీతంగా పలువురు నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతు..గాంధీ మహాత్ముని అహింసా సిద్ధాంతం ఆంగ్లేయులను తరిమి కొట్టిందని, ఆయన ఆదర్శాలను అనుసరించి భారత దేశం ప్రతిష్టను మరింత గా ఇనుమడింప జేయాలని కోరారు. ఇందులో శామీర్ పేట టీఆర్ఎస్ మండల అధ్యక్షులు విలాసాగరం సుదర్శన్,ఉప సర్పంచ్ నర్ల రమేష్ యాదవ్ కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి టీఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్, గ్రామ అధ్యక్షులు మేడి రవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వైఎస్ శంకర్ గౌడ్, గ్రామ కో ఆప్షన్ మెంబర్ మహేందర్ యాదవ్, వంగ వెంకట్ రెడ్డి, మేడి భాస్కర్, వార్డు సభ్యులు మురళి వజ్జల, ఉప్పలయ్య, సత్యనారాయణ, నవీన్ ముదిరాజ్, శ్రీకాంత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
2ఎస్పీటీ -2: గాంధీ కి నివాళులు అర్పిస్తున్న నాయకులు
గాంధీ అడుగుజాడల్లో నడవాలి




