Tuesday, 3 November 2026

గాంధీ ఆసుపత్రిలో వ్యక్తిని పీక్కుతింటున్న కుక్కలు

సికింద్రాబాద్‌:గాంధీ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చాడు. ఆయనకు తక్షణం వైద్య సహాయం అందించాల్సి వైద్యులు బాధితుడిని చేర్చుకోలేదు సరికదా మధ్యాహ్నం తర్వాత రావాలంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్లిపోయారు. దీంతో ఒంటినిండా గాయాలతో కదల్లేని స్థితిలో ఉన్న బాధితుడు ఆస్పత్రి ఆవరణలోనే పడిపోయాడు. అక్కడే ఉన్న కుక్కలు చలనం లేకుండా పడి ఉన్న బాధితుడిని చేరుకుని పీక్కు తింటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *