గాంధీ సినిమా వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి

జిల్లా విద్యాశాఖ అధికారి.
నల్గొండ బ్యూరో జనం సాక్షి
స్వతంత్ర భారత వ జ్రొత్సవ ద్విసప్తాహ కార్యక్రమంలో భాగంగా గాంధీ సినిమాను పాఠశాల విద్యార్థులతో కలిసి చూశారు జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం బిక్షపతి గారు. ఈ వేడుకలలో భాగంగా ప్రదర్శిస్తున్న ఫ్రీ సినిమా ను నల్లగొండ వెంకటేశ్వర థియేటర్లో పరిశీలించారు. ఇట్టి సినిమాను ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి 21వ తారీకు వరకు ఉచితంగా ప్రతి పాఠశాల విద్యార్థి తిలకించేటందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు సినిమా చూసి వెళ్లేటందుకు బస్సు ఇతర ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు.

 

తాజావార్తలు