Thursday, 5 November 2026

గాయత్రీదేవి అలంకారం లో గణేష్ పాడు విజయదుర్గ అమ్మవారు

28 సెప్టెంబర్ జనం సాక్షి:
దసరా శరన్నవరాత్రిమహోత్సవాల్లో భాగంగా మూడవ రోజు గణేష్ పాడు లో వేంచేసి ఉన్న విజయదుర్గ అమ్మవారు గాయత్రీ దేవి* అలంకారం లో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ దాతలు మందలపల్లి ఉప సర్పంచ్ దిశా కమిటీ సభ్యులు గారపాటి సూర్యనారాయణ, అనురాధ దంపతులు ఆధ్వర్యంలో కుంకుమ పూజలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా భక్తులు, భవాని లు భక్తి పారవశ్యం లో మునిగి తేలారు.