నేడు ఖమ్మo-కరీంనగర్ రహదారుల దిగ్బంధనానికి పిలుపు
హైదరాబాద్,మే30(జనం సాక్షి): రైతు బంధు పధకాన్ని కౌలు రైతులకు,పోడు గిరిజన రైతులకు వర్తింప జేయాలని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షురాలు పశ్యపద్మ కోరారు. నూతన కౌలు రైతుల చట్టాన్ని తీసుకరావడానికే రైతు బంధు పధకంలో కౌలు రైతులకు చోటు ఇవ్వేలేదని అర్థం అవుతోందని ఆమె అన్నారు. రైతు సంఘాల జేఏసి ఆధ్వర్యంలో బస్సుయాత్ర సందర్బంగా రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షురాలు పశ్యపద్మ విూడియా సమావేశంలో మాట్లాడుతూ సాగు వ్యయంలో 50శాతం కలిపి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. రైతులు పండించిన పంటకు గిటు బాటు ధర చెల్లిస్తే రైతు బంధు పధకంతో పనే లేదన్నారు. భూగరిష్టి పరిమితికి మించి భూములు కలిగిన భూస్వాముల నుంచి భూములను వెనక్కి తీసుకోని పేదలకు పంపిణి చేయాలన్నారు. అలాగే వాస్తవ సాగుదారులందరికి రైతు బంధు పధకాన్ని వర్తింపజేయాలన్నారు. స్వామినాధన్ కవిూషన్ సిపారస్ లను వెంటనే అమలు చేయాలని,రైతుల ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం రైతు సంఘాల జేఏసి ఆధ్వర్యంలో ఈనెల31న ఖమ్మం నుంచి కరీంనగర్ వరకు జాతీయ రహదారుల దిగ్బంధనం కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. దీనిలో అంతా పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
ఈ విలేకర్ల సమావేశంలో రైతు సంఘాల జేఏసి నాయకులు అచ్చుతరామారావు, విద్యాసాగర్, రాంచంద్రారెడ్డి మందడపు నాగేశ్వర్ రావు, రామక్రష్ణరెడ్డి, బండి రమేశ్,ఆవుల వెంకటేశ్వర్లు,కోలేటి నాగేశ్వర్ రావు, వెంకట్ రెడ్డి, మందడపు రాణి, ప్రేమ్ కుమార్, పాల్గొన్నారు.




