Tuesday, 3 November 2026

ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఈటెల సవిూక్ష

అన్నదాతలకు అండగా ఉంటామని హావిూ
రేషన్‌ బియ్యం వద్దనుకున్నా కార్డు రద్దు చేయమని హావిూ
హైదరాబాద్‌,మే30(జ‌నం సాక్షి):  అకాల వర్షాలతో దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు పౌరసరఫరాల శాఖమంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.  ధాన్యం సేకరణ, తమిళనాడుకు బియ్యం సరఫరా, తదితర అంశాలపై అధికారులతో జరిగిన  సమావేశంలో చర్చించారు. అన్నదాతలను అన్ని విధాల ఆదుకుంటామన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలు పెంచామన్నారు. రైతుల నుంచి చివరి బస్తా వరకూ కొనుగోలు చేస్తామన్నారు. బియ్యం అక్రమ రవాణాపై పీడీ యాక్ట్‌ పెడుతున్నామన్నారు. డీలర్ల కవిూషన్‌ పెంపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 33 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనాలని మిల్లర్లను అదేశించామని చెప్పారు. ధాన్యం మిల్లుకు చేరిన 3 నెలల్లోనే బియ్యం ప్రభుత్వానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇదే విషయమై బుధవారం విూడియాతో మాట్లాడిన మంత్రి.. కొందరు లబ్దిదారులు కార్డులు రద్దవుతాయని అవసరం లేకున్నా బియ్యం తీసుకుంటున్నారని అన్నారు. లబ్దిదారులు రేషన్‌ బియ్యాన్ని దళారులకు అమ్మొద్దని సూచించారు. బియ్యం అవసరం లేదనుకున్న వారు కార్డుపై సంతకం చేస్తే చాలని, రేషన్‌కార్డు కొనసాగించే అవకాశం కల్పిస్తామని మంత్రి తెలిపారు.