Tuesday, 3 November 2026

గిన్నిస్ లోకి గాజువాక లడ్డు

తాపేశ్వరంలో తయారైన అతి పెద్ద లడ్డూ..విశాఖ గాజువాక వినాయక మండపానికి చేరింది. భారీ వాహనంలో లడ్డూని మంటపానికి నిర్వహకులు తీసుకువచ్చారు.  విశాఖ‌ప‌ట్ట‌ణంలోని గాజువాక‌లో ఏర్పాటు చేసిన 78 అడుగుల విఘ్నేశుడికి ఆ ల‌డ్డూను నైవేద్యంగా స‌మ‌ర్పించారు. గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించిన ఆ ల‌డ్డూ 29,465 కేజీల బరువు ఉంది. సుమారు రూ.50 ల‌క్ష‌ల ఖ‌ర్చుతో ల‌డ్డూను త‌యారు చేశారు. ల‌డ్డూను త‌యారు చేసేందుకు 20 మంది  20 గంట‌లు ప‌నిచేశారు. విశాఖ సంక్షేమ సంఘం ఈ ల‌డ్డూను లంబోదరునికి స‌మ‌ర్పించింది గ‌ణ‌నాధుడికి భ‌క్తులు భారీ కానుక‌లు స‌మ‌ర్పిస్తున్నారు. ఇవాళ్టి నుంచే ఈ లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయనున్నారు. గ‌త ఏడాది గుజ‌రాత్‌లోని అర‌సూరి అంబాజీ మాతా దేవ‌స్థానం ట్ర‌స్టు గ‌ణేశుడికి 11,115 కేజీల ల‌డ్డూను స‌మ‌ర్పించారు. ఆ రికార్డును సురిచి పుడ్ కంపెనీ ఇప్పుడు బ్రేక్ చేసింది. 45 శాతం చ‌క్కెర‌, 23 శాతం శెన‌గ ప‌ప్పు, 27 శాతం నెయ్యి, 5 శాతం డ్రై ఫ్రూట్స్‌తో తాపేశ్వ‌రం భారీ ల‌డ్డూను త‌యారు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *