: లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు దరావత్ బాలు నాయక్
ఎల్బీనగర్ (జనం సాక్షి ) గిరిజనుల తీజ్ పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని అదే విధంగా ప్రతి జిల్లాకు 2 కోట్ల బడ్జెట్ కేటాయించాలని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టిన జెడ్ చొంగ్తు ని కలిసి లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు దరావత్ బాలు నాయక్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ నాయక్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది
కమిషనర్ మాట్లాడుతూ గిరిజన పండుగలలో తీజ్ పండగ చాలా ముఖ్యమైనది కావున ప్రత్యేక బడ్జెట్ ను అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది
బాలు నాయక్ మాట్లాడుతూ తొమ్మిది రోజులు జరుపుకునే ఈ తీజ్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే మా గిరిజన సమాజం రుణపడి ఉంటదని అలాగే ఈ తీజ్ పండుగకు మా సేవాలాల్ మహారాజ్ , మేరామ యాడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తాము గిరిజన సంస్కృతి సంప్రదాయాలతో ఈ పండుగను చాలా అందంగా వైభవంగా జరుపుకుంటామని తెలిపారు
లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ నాయక్ మాట్లాడుతూ మా గిరిజన పండుగలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే కెసిఆర్ ప్రభుత్వానికి మా గిరిజన విద్యార్థులు మేధావులు మళ్లీ కెసిఆర్ నే గెలిపిస్తరని అదే విధంగా గిరిజన పండుగలకు సెలవు దినం ప్రకటించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం




