ఆదిలాబాద్,జూన్2(జనం సాక్షి): ఆదివాసీ హక్కుల కోసం పోరాడుతామని ఆదివాసీ తెగ సంఘాల ఐక్యకార్యచరణ సమితి ప్రకటించింది. గిరిజనలు హక్కలుకు భంగం కలిగితే ఊరుకునేది లేదని హెచ్చరించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాల ఐక్యకార్యచరణ సమితి కన్వీనర్ కనక యాదవ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనచట్టంలో పేర్కొన్నట్లుగా గిరిజన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్చేసారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను వెలుగులోకితేవడంతో పాటు అన్నిరంగాల్లో అవకాశం కల్పించాలన్నారు. గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటు చట్టం తేవడంతో పాటు వచ్చే విద్యాసంవత్సరం నుంచి అవి నడిచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇదిలావుంటే ఎస్సీ,ఎస్టీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని అఖిలభారత షెడ్యూల్డ్కులాలు, జాతుల హక్కుల పరిరక్షణ సమితి నేతలు డిమాండ్ చేశారు. ఇన్నేళ్లు గడిచినా ఎస్సీ,ఎస్టీలు అభివృద్ధికి నోచుకోవడం లేదని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వశాఖల్లో వీరికి పదోన్నతులు కల్పించాలని స్పష్టం చేశారు. బ్యాక్‌పోస్టుల భర్తీ, ఆయాశాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఒప్పంద, సీఆర్టీలను క్రమబద్ధీకరించాలని పేర్కొన్నారు. నిరుద్యోగ ఎస్సీ,ఎస్టీ యువతకు జీవనభృతి నెలకు రూ.2వేలు అందజేయాలని, కోరారు. రైతులకు రాయితీపై ఎరువులు, విత్తనాలు, పనిముట్లు అందజేయాలని తెలిపారు.




