గీత కార్మికుని కుటుంబానికి ‘గోపా’ చేయూత

కేసముద్రం ఆగస్టు 13 జనం సాక్షి  / మండలంలోని తాళ్ళపూస పల్లి గ్రామంలో ఈనెల 6న తాటి చెట్టు పై నుండి ప్రమాదవశాత్తు జారిపడి దుర్మరణం పాలైన నరేటి బిక్షం కుటుంబానికి మహబూబాబాద్ జిల్లా గౌడ ప్రొఫెషనల్ అండ్ అఫీషియల్స్ అసోసియేషన్ (గోపా) ఆధ్వర్యంలో శనివారం 11,500 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గోపా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుర్ర శ్రీనివాస్ గౌడ్, బెల్లంకొండ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గీత వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న బిక్షం అకాల మరణంతో ఆ కుటుంబానికి చేయూతను అందించాలని లక్ష్యంతో తమ సంఘం ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. బిక్షం కుమారుడు ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నందున అతని చదువుకు అన్ని విధాలుగా సహాయం చేయడంతో పాటు వరంగల్ నగరంలో గౌడ హాస్టల్లో ఉచితంగా వసతి కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపా జిల్లా కోశాధికారి ముక్తేశ్వర్ గౌడ్, రాష్ట్ర నాయకులు బిక్కీ వెంకటేశ్వర్లు గౌడ్, చీకటి శ్రీనివాస్ గౌడ్, జిల్లా నాయకులు సమ్మెట వెంకన్న గౌడ్, చిలువేరు సమ్మయ్య గౌడ్, గొర్రె వెంకన్న గౌడ్, కేసముద్రం వైస్ ఎంపీపీ రావుల నవీన్ రెడ్డి, తాళ్ల పూస పల్లి గ్రామ గౌడ సొసైటీ అధ్యక్షుడు నరెటి సత్తయ్య గౌడ్, మొగులగాని సుధాకర్, బోయిని రమేష్, వల్లాల రాజేందర్, కొమురయ్య, వంశీ తదితరులు పాల్గొన్నారు.
 

తాజావార్తలు