ఎన్నికల ఇన్చార్జ్ మిద్దెల జితేందర్
ఎల్బీనగర్ (జనం సాక్షి ) ఎల్బీనగర్ నియోజకవర్గం లో జరిగినటువంటి ఆజాద్ కి గౌరవ పాదయాత్ర తెలంగాణ రాష్ట్ర ఐ ఎన్ టి సి అధ్యక్షులు , ఎల్బీనగర్ నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జ్ అయినటువంటి మిద్దెల జితేందర్ ఆధ్వర్యంలో పాదయాత్ర చంపాపేట గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభించడం అయినది చంపాపేట నుండి బి.యన్ రెడ్డి నగర్ పద్మపాని ఆచార్య విగ్రహం వరకు పాదయాత్ర చేయడమైనది పాదయాత్ర సందర్భంగా మిద్దెల జితేందర్ మాట్లాడుతూ 75 సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీ తెచ్చిన భారతదేశ స్వాతంత్ర వజ్రోత్సవాలు జరుపుకోవడం సంతోషమని ఆయన తెలియజేశారు నాడు 200 సంవత్సరాల బ్రిటిష్ పరిపాలనలో దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు 20 ఊర్లకు కరెంటు ఒక నాలుగు విమానాలు ఉండే విద్య వైద్యము ఉద్యోగం ఏమీ లేని నాడు ఒక గుండు సూదిని కూడా మనం ఇతర దేశాల నుంచి తెచ్చుకునేవారు మొట్టమొదట నెహ్రూ ప్రధాని అయిన తర్వాత అనేక సాంకేతిక టెక్నాలజీతో విద్య వైద్యము రైల్వేస్ ఓడలు ఎయిర్పోర్ట్స్ ఉద్యోగాలు ఈరోజు అంగార గ్రహం ఉపగ్రహం పంపేస్తాయికి మన కాంగ్రెస్ పార్టీ ప్రధానులు కృషి చేశారని ఆయన అన్నారు అనేకమంది కాంగ్రెస్ పార్టీ ప్రధానులు ఈ దేశం కోసం బలి అయ్యారు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఈ దేశ కోసం బలైన విషయం మీ అందరికీ తెలిసిందే గడిచిన 8 సంవత్సరాలలో ప్రధాని మోదీ కాంగ్రెస్ ప్రధానులు చేసినటువంటి టెక్నాలజీని వాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాల లో ఏమి చేయలేదనడం సిగ్గుచేటు ఆయన అన్నారు మోడీ ఆయములో జరిగినటువంటి నోట్ల రద్దు ఎల్ఐసి ప్రైవేటుపరం పేదలపై జిఎస్టి ఉప్పు పప్పు పాలు వంట సరుకులు గ్యాస్ పెట్రోల్ అనేక సరుకులపై రేట్లు పెంచి గత ఎనిమిది సంవత్సరాల లో పేదవాళ్ల నడ్డి విడిచిన మోడీ అని ఆయన విమర్శించారు ఈ దేశానికి సైనికులు ఒక బలం దుష్ట పాకిస్తాన్ బార్డర్లో చొరబడినప్పుడు కార్గిల్ యుద్ధం లో ప్రాణాలు వదిలిన భారతరత్న మేజర్ పద్మపాణి ఆచార్య స్మరించుకోవడం మన అదృష్టంగా భావించడమైనది ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి జక్కడి ప్రభాకర్ రెడ్డి కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ఫోక్ పర్సన్ గజ్జి భాస్కర్ మాజీ ఫోర్ లీడర్ వెంకటేష్ యాదవ్ సుజాత గంట కృష్ణ చక్రి యాదగిరి సలీం రఘునందన్ రెడ్డి రాఘవాచారి యాదగిరి చిరంజీవి కారుకొండ శివ రెడ్ల శివ రాజా తోకటి కిరణ్ వెంకటేష్ గాంధీ నాయక్ శ్రీనివాస్ ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి 11 డివిజన్ నుంచి డివిజన్ ప్రెసిడెంట్ లు , కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పాల్గొని పాదయాత్రను విజయవంతం చేశారు




