Wednesday, 4 November 2026

గుట్ట అభివృద్ధిపై ముగిసిన సీఎం సమీక్ష

CM KCR review on Yadagiri gutta

నల్గొండ : యాదగిరి గుట్ట అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష ముగిసింది. యాదగిరిగుట్టలో ఇవాళ సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో గుట్ట అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఆలయ అభివృద్ధితో పాటు రహదారుల నిర్మాణం, భక్తుల సౌకర్యాల ఏర్పాట్లపై చర్చించారు. ఆగమశాస్త్రం ప్రకారమే ఆలయ అభివృద్ధి జరగాలని సీఎం అధికారులకు సూచించారు. రాబోయే బడ్జెట్‌లో గుట్ట అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయిస్తామని సీఎం ప్రకటించిన విషయం విదితమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *