గుడుంబా స్థావరాలపై ఎక్సయిజ్ అధికారుల దాడులు
ఎసై రాయబారపు రవి కుమార్
ఖానాపూర్ రూరల్ 1 సెప్టెంబర్ (జనం సాక్షి): గుడుంబా స్థావరాలపై ఎక్సయిజ్ అధికారులు గురువారం ఇక్బ్ ల్ పూర్,లో వరుస దాడులు చేస్తున్నందున గుడుంబా తయారీ దారులు తమ పంద మార్చ్ కొని తమ ఇండ్లలో కాకుండా గ్రామ శివారులో నిర్మానుషు ప్రదేశాల్లో టూ విల్లర్ పోనీ దారిని ఎంచుకొని గుడుంబా తయారు చేస్తున్నారు.అని నిర్మల్ ఎక్సయిజ్ ఎసై రవి కుమార్ అన్నారు.ఈ సందర్భంగా అక్కడ నిలువ ఉన్న ఆరు డ్రమ్ములో పులియ బెట్టిన 450 లీటర్ ల బెల్లపు పానకాన్ని నేర స్థలాల్లో ధ్వంసం చేశారు.అలాగే ఖానాపూర్ సుభాష్ నగర్ చివరలో వాగు వెనుక బోధాసు రాజు గుడుంబా తయారు చేస్తుండగా పట్టుకొని స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ వద్ద హాజరు పరిచి కేసు నమోదు చేసినట్లు ఎసై రవి కుమార్ తెలిపారు.అలాగే తిరిగి నేరం చేయకుండా సత్ప్రవర్తన కలిగి ఉండే విధంగా బైండోవర్ చేసినట్లు తెలిపారు.ఈ తనిఖీల్లో ఎక్సయిజ్ సిబ్బంది ముత్యం,రాజశేఖర్,భాస్కర్,ఇర్ఫా న్,నాయీమ్,కల్పన పాల్గొన్నారు.