గుడ్డుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు
మక్తల్ అక్టోబర్ 14 (జనంసాక్షి) అక్టోబర్ 14 ప్రపంచ గుడ్డు దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ బీమా ఆధ్వర్యంలో సుమారు 50 మంది రోగులకు చెరో రెండు కోడి గుడ్లతో పాటు పౌష్టికాహారము అందించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సూగురు జైపాల్ రెడ్డి మాట్లాడుతూ కోడి గుడ్డుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. విటమిన్ *సి* తో పాటు అనేక పోషకాలు గుడ్డులో లభిస్తాయని అందుకే గర్భిణీలు బాలింతలు చిన్నారులతో పాటు ప్రతి ఒక్కరూ కోడిగుడ్డును ఆహారంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అడ్మినిస్ట్రేటర్ అక్కల సత్యనారాయణ, సభ్యులు ఎమ్మార్ రామచంద్రప్ప, కట్ట వెంకటేష్ ,మామిళ్ళ పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.