Thursday, 5 November 2026

గుడ్ల ధరలకు మరోమారు రెక్కలు

రూ.6కు చేరడం ఖాయమంటున్న వ్యాపారులు

హైదరాబాద్‌,జూలై21(జ‌నం సాక్షి): కోడిగుడ్ల ధరలకు రెక్కలొచ్చాయి. రోజురోజుకూ ధరలు పెరుగుతూ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నెల రోజుల క్రితం రూ.4 ఉన్న గుడ్డు ధర ప్రస్తుతం రూ.5కు పెరిగింది. ఇది ఆరుకు కూడా చేరుతుందని చికెన్‌ సెంటర్‌ నిర్వాహకులు అంటున్నారు. ఉత్పత్తిపడిపోవడమే కారణమిని విశ్లేషిస్తున్నారు. వేసవిలో కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఇక్కడి నుంచే గుడ్లు ఎగుమతి చేశారు. దీంతో జిల్లాల్లో ప్రస్తుతం గుడ్ల ఉత్పత్తి తగ్గడంతో వీటి ధర రూ.5కు చేరింది. ప్రతి ఏడాది అక్టోబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు గుడ్లకు డిమాండ్‌ ఉండే కాలంగా పౌల్టీ వ్యాపారులు పరిగణిస్తారు. అయితే ఈ ఏడాది పక్క రాష్టాల్రకు ఎగుమతి చేయడం వల్ల ముందుగానే ధరలు పెరిగాయని చెబుతున్నారు.దీంతో పేదలు గుడ్డు కొనుగోలు చేయలేని పరిస్తితి ఎదురవుతోంది. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు, గర్భిణులు, బాలింతలు, విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో సైతం గుడ్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గుడ్ల వినియోగం అమాంతంగా పెరిగింది. 10 శాతం ఉత్పత్తి పడిపోవడం.. మరో 10 శాతం అమ్మకాలు పెరగడంతో డిమాండ్‌ ఎక్కువైంది. ప్రస్తుతం ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్‌ పెరిగిందని.. పౌల్టీ రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం గుడ్డు ¬ల్‌సెల్‌ ధర రూ.4.50 ఉండగా.. బహిరంగ మార్కెట్‌లో రూ.5కు విక్రయిస్తున్నారు. పౌల్టీఫ్రామ్‌ నుంచి రూ.4.50కు కొనుగోలు చేసిన గుడ్లను ఒక్కోగుడ్డుకు రూ.5 నుంచి రూ.5.50 వరకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం కోళ్లను ఉత్పత్తి చేసే పౌల్టీప్రామ్స్‌ తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.