Wednesday, 4 November 2026

గురుకులాలను ఈ ఏడాదే ప్రారంభించాలి

– ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్య
హైదరాబాద్‌, జులై7(జ‌నం సాక్షి) : బీసీల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిన్నచూపు, నిర్లక్ష్యం తగదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. సీఎం ప్రకటించిన 119 గురుకులాలను ఈ సంవత్సరమే ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ..  బీసీలకు ఇప్పటికే అనేక రకాలుగా అన్యాయం జరిగిందని, మరోమారు ముఖ్యమంత్రి మోసగించడం తగదన్నారు. గురుకులాలను వచ్చే సంవత్సరం ప్రారంభిస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. బీసీలను ఓటు వేసే యంత్రాంగాలుగా మాత్రమే చూడటం తగదన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల వాగ్దానాలు మానుకోవాలని సూచించారు. బీసీలు చదువుకోకుండా చూడాలనేది ముఖ్యమంత్రి ఉద్దేశమా అని ప్రశ్నించారు. మాటలతో మాత్రమే కాలపయాపన చేయకుండా వెంటనే పనులను ప్రారంభించేలా చర్యలు   చేపట్టాలని అన్నారు.