గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ తరగతి గదుల ప్రారంభం
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఇటీవలే అదనపు తరగతి కోసం అప్ గ్రేడింగ్ చేశారండి రీజినల్ కో ఆర్డినేటర్ స్వరూపా రాణి తెలిపారు
ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ తరగతి గదులను ఉమ్మడి అదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ స్వరూపారాణి, మున్సిపల్ చైర్ పర్సన్ జంగంకళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.
అనంతరం పాఠశాలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేశారు.
తదనంతరం పాఠశాల సిబ్బంది రక్షాబంధన్ ఏర్పాటు చేయగా విద్యార్థులు అతిథులుగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి రాఖీలు కట్టి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు.
ఇందులో భాగంగా విద్యార్థినిలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.
ఈ క్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ స్వరూపారాణి మాట్లాడుతూ ఈ సంవత్సరం కేవలం బైపిసి గ్రూప్ వారికి అవకాశం కల్పించిందని ఇందులో 40 విద్యార్థులు విద్యను అభ్యసించనున్నట్లు తెలిపారు.
ఇంటర్మీడియట్ లో ఉన్న మిగతా గ్రూపులను వచ్చే సంవత్సరంలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
బైపిసి గ్రూప్ తీసుకున్న వారికి మెడికల్ వరంగా మంచి అవకాశాలు రావడం జరుగుతుందని తెలిపారు.
ఇంటర్మీడియట్ తరగతులను బోధించడానికి గెస్ట్ ఫ్యాకల్టీలను త్వరలోనే త
నియమిస్తామని ఆమె వివరించారు.
గురుకుల పాఠశాలలు అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్, గురుకుల మంత్రి ఉప్పుల ఈశ్వర్, గురుకులాల సెక్రటరీ రోనాల్డ్ రాస్ లకు అర్.సి.ఓ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ప్రేమ రాణి, వైస్ ప్రిన్సిపాల్ సఫియా, పట్టణ ఎస్సై అశోక్, కౌన్సిలర్లు జీలకర్ర మహేష్, రేవెల్లి ఓదెలు, పోగుల మల్లయ్య, పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు రామిల్ల శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.