Wednesday, 4 November 2026

గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో సీట్ల కోసం దరఖాస్తు స్వీకరణ:

శామీర్ పేట్, జనం సాక్షి :
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల (జగద్గిరిగుట్ట) షామీర్పేట యందు ఖాళీగా ఉన్న సీట్ల కోసం ఎస్సీ విద్యార్థుల నుండి దరఖాస్తుల స్వీకరిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇష్రత్ తెలిపారు. ఖాళీల వివరాలు ఎం ఎస్ సి ఎస్ ఎం ఎస్ డి ఎస్ -90 సీట్లు ఎం జెడ్ సి బి జెడ్ సి ల యందు 20 సీట్లు బీకాం బిఎ -15 సీట్లు బికం సి ఏ-6 సీట్లు దరఖాస్తులను ఈనెల 9వ తేదీ వరకు కళాశాలకు వచ్చి ఇవ్వవలసిందిగా తెలిపారు.
ప్రిన్సిపల్ డాక్టర్ ఇశ్రత్