మానాల గ్రామాభివృద్ధి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నిక

రుద్రంగి అక్టోబర్ 2 (జనం సాక్షి)
రుద్రంగి మండలం మానాల గ్రామములో ఆదివారం నూతన గ్రామభివృద్ధి కమిటీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు,అధ్యక్షులుగా కొమ్ముల రవిందర్ రెడ్డి,ఉపాధ్యక్షులుగా ఇండ్ల లస్మయ్య,బాధనవేని రాజరెడ్డి, కోశాధికారీగా లాకావత్ బాలును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన విడిసి చెర్మెన్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ…. గ్రామాభివృద్ధికి తమవంతుగా శాయశక్తుల కృషి చేస్తామని పేర్కొన్నారు.గత 30 సంవత్సరాలుగా గ్రామములో రెండేళ్ళ కోక్కసారి అన్ని కుల సంఘాల సభ్యులందరు కలిసి అధ్యక్షున్ని ఎన్నుకుంటారని,ఈసారి పోటి లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని వారికి కృతజ్ఞతలు తెలిపారు.నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవం చేసుకున్న సభ్యులను వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య,సర్పంచ్ అల్లురి మానస అభినదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో ప్యాక్స్ చెర్మెన్ ఎలెటి చిన్నారెడ్డి,ఉప సర్పంచ్ చందా రాజేశం,మాజీ వైస్ ఎంపీపీ బాధనవేని రాజారాం.మాజీ విడిసి చెర్మెన్ జక్కు జెలెందర్,జక్కు మోహన్,జె అంజయ్య, గుర్రం సాయన్న తదితరులు పాల్గొన్నారు.