Friday, 6 November 2026

గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు ఆహ్వానం

చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 08 : చేర్యాల మండల కేంద్రంలోని సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఎస్సీ విద్యార్థినీలకు బీజెడ్సీ-1, ఎంజెడ్సీ-12, బికాం(కంప్యూటర్)-2, ఎంఎస్సీ ఎస్-20, బీఏ-10 గ్రూపు సీట్లలో అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉన్నట్లు స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.సునీత శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆసక్తి ఉన్న విద్యార్థినీలు ఈనెల 8నుండి కళాశాలకు వచ్చి ప్రవేశం పొందవచ్చని తెలిపారు.