జనం సాక్షి/ కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధి ఏడుపాయల దేవాలయం సమీపంలోని మంజీర నది వద్ద గుర్తు తెలియని మగ మృతదేహం లభ్యమై తెల్లటి గోనె సంచులతో రాళ్లతో కట్టి నదిలో పడేశారని ఈ గుర్తు తెలియని చనిపోయిన మగ వ్యక్తి గురించి ఏదైనా సమాచారం ఉంటే మెదక్ రూరల్ సిఐ గారికి కానీ, కొల్చారం ఎస్.ఐ గారికి కానీ, కొల్చారం పోలీస్ స్టేషన్ కి గాని తెలియజేయగలరు. మరణించిన అతని మృత దేహంపై బూడిద రంగు జీన్స్ ప్యాంట్, అలాగే తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ మరియు మెరూన్ రంగులతో కూడిన ఒక టవల్ ఉన్నాయని మృతుడి వయసు అందాద 35 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలు ఉంటుందని అన్నారు.
మృతుని శరీరం పై గల ఆనవాళ్ళు
1. కుడి భుజంపై ఓం గుర్తు గల పచ్చ బొట్టు,
2. ఛాతీ ఎడమ వైపున తెలుగులో జంగయ్య విరామని పచ్చ బొట్టు,
ఎత్తు సుమారుగా 5’8 నుండి 5’9 అడుగులు,
సమాచారం అందించాల్సిన ఫోన్ నెంబర్లు
1.శ్రీ.విజయ్ గారు CI మెదక్ రూరల్ సర్కిల్ – 8712657916
2. కుల్చారం ఎస్.ఐ – 8712657919
3. కుల్చారం పోలీస్ స్టేషన్ – 8712657880
4. పోలీస్ కంట్రోల్ రూమ్ -871265888
గుర్తుతెలియని శవం లభ్యం




