అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 20
గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో కూర్చొని మహిళపై దాడి చేసిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గురువారం బాధితురాలు కుటుంబ సభ్యులు అల్వాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్వాల్ హిల్స్ రోడ్ నెంబర్ 2 వద్ద గల రమేష్ చౌదరి ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి అతని భార్య కౌసల్య తల పై రాడు తో దాడి చేసి గాయపరిచారు. బాగా రక్తస్రావం కావడంతో గమనించిన ఇంటి యజమాని రమేష్ చౌదరి తన భార్య కౌసల్య చౌదరిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు.మహిళా భర్త రమేష్ చౌదరి అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.పాత కక్షలు ఎవరితో నైనా ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. బాధితులతోఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు అల్వాల్ పోలీసులు తెలిపారు.




