గులాబి గులాములు వికారాబాద్ బిజెపి నాయకులు

– బుదారపు బుచ్చిరెడ్డి. బిజెపిలో కొత్తవారిని ఈమడనివ్వరు అందుకే బిజెపికి రాజీనామా చేస్తున్న.
ఈనెల 18న మాజీ మంత్రి చంద్రశేఖర్ తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిక
మోమిన్ పేట ఆగస్టు 14 జనం సాక్షి
బిజెపి వికారాబాద్ అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ బుదారాపు బుచ్చిరెడ్డి*
వికారాబాద్ : బిజెపికి గుడ్ బై చెప్పారు. ఆ పార్టీ వికారాబాద్ అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ బుదారపు బుచ్చిరెడ్డి . మొదటినుంచి ఆయన మాజీ మంత్రి చంద్రశేఖర్ బాటలోనే నడుస్తున్నానని చెప్పారు తాజాగా చంద్రశేఖర్ రాజీనామా చేసిన నేపథ్యంలో తాము కూడా బిజెపికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. గులాబీ పార్టీకి వికారాబాద్ బిజెపి నాయకులు గులాములుగా మారారని ఆరోపించారు. కొత్తవారిని ఈమడనివ్వరని విమర్శించారు భారతీయ జనతా పార్టీ బి ఆర్ ఎస్ ఢిల్లీ నుంచి గల్లి వరకు ఒకటేనని స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు పార్టీలో జరుగుతున్న పరిణామాలు నిజమైన కాషాయవాదులకు తెలియజేయసే ప్రయత్నం చేస్తున్నాను తప్ప వేరే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. బట్టలు చింపుకొని నమ్మకంతో పనిచేస్తే వికారాబాద్ బిజెపి నేతలు ఆ నమ్మకాన్ని బి ఆర్ ఎస్ కు అమ్ముకుంటున్నారని బుచ్చిరెడ్డి మండిపడ్డారు . ఈనెల 18న కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఆయన తెలిపారు . చంద్రశేఖర్ వెన్నంటే ఉంటామని బుచ్చిరెడ్డి వివరించారు..

తాజావార్తలు