.భువనగిరి టౌన్ (జనం సాక్షి):–భువనగిరి మున్సిపల్ కేంద్రంలోని సాయికృప కాలేజీలో గూడూరు నారాయణరెడ్డి ఫౌండేషన్ సౌజన్యంతో ఎస్సై, కానిస్టేబుల్స్ ఉద్యోగాల కోసం మెయిన్స్ పరీక్ష కి ప్రిపేర్ అవుతున్న పి ఎస్ ఆర్ కోచింగ్ సెంటర్ లోనీ అభ్యర్థులను బీజేపి మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ సందర్శించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల యువత కోచింగ్ కోసం హైదరాబాద్ వెళ్లి అధిక డబ్బులు ఇచ్చి కోచింగ్ తీసుకోలేని వారికోసం పి ఎస్ ఆర్ కోచింగ్ సెంటర్లో గూడూరు నారాయణరెడ్డి ఫౌండేషన్ ద్వారా వారికి ఉచిత వసతి తోపాటు నాణ్యమైన శిక్షణ ఇప్పించడం చాలా సంతోషంగా ఉందని, మీ అందరూ కూడా గూడూరు నారాయణరెడ్డి అందించిన శిక్షణతో ప్రభుత్వ ఉద్యోగం సాధించి వారి ఆశ నెరవేర్చాలని విద్యార్దిని, విద్యార్దులకు సూచించారు.అంతేకాకుండా యువత లక్ష్యాన్ని నిర్దేశించుకోని కష్టపడి చదివి ఉద్యోగాలను సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని అన్నారు. ఇక్కడ గూడూరు నారాయణరెడ్డి ఫౌండేషన్ ద్వారా కోచింగ్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ కుటుంబానికి, దేశానికి ఆదర్శంగా నిలవాలని అయిన అన్నారు .ఈ సందర్భంగా గూడూరు నారాయణరెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ అభినందించారు. ఈరోజు కోచింగ్ చివరి రోజు సందర్భంగా అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గూడూరు నారాయణరెడ్డి ఫౌండేషన్ సోజన్యంతో పది నెలలుగా నాణ్యమైన ఉచిత కోచింగ్ ఇప్పించిన గూడూరు నారాయణరెడ్డి ఉద్యోగాలు సాధించి బహుమతిగా ఇస్తామని అన్నారు. తదనంతరం ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ ,గూడూరు నారాయణరెడ్డి పిఎస్ఆర్ కోచింగ్ సెంటర్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి శాలువాతో సన్మానించారు.
గూడూరు నారాయణరెడ్డి ఫౌండేషన్ సేవలు యువత కు ఆదర్శం కావాలి :- ఎన్ వి ఎస్ ఎస్




