గృహలక్ష్మి దరఖాస్తులకు 15 రోజులు సమయం పొడిగించాలి- సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు రామ్ చందర్
టేకులపల్లి, ఆగస్టు 9 (జనం సాక్షి ): గృహలక్ష్మి పథకం క్రింద లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడానికి కేవలం రెండు రోజులు కేటాయించడం సరైంది కాదని, కనీసం 15 రోజులు దరఖాస్తు చేసుకోవడానికి పొడిగించాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు గుగులోతు రామచందర్ అధికారులను కోరారు. దీనితో పాటుగా దరఖాస్తుదారులు కులం, ఆదాయ సర్టిఫికెట్లను, బ్యాంకు ఎకౌంటు కూడా జతపరచాలని ఆదేశాలు ఇచ్చారు. దీనితో నిరుపేదలు ఆందోళనకు గురవుతున్నారు. మూడు రోజుల్లో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ తీసుకోవడం సాధ్యం కాదని కనీసం 15 రోజులు సమయం పొడిగించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ టేకులపల్లి మండల సమితి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.