Wednesday, 4 November 2026

గొప్ప నేతను దేశం కోల్పోయింది

ములాయంసింగ్ యాదవ్  మృతి పట్ల  : విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంతాపం.

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్  మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి   తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా,కేంద్రమంత్రిగా పనిచేసిన ములాయం సింగ్  తన జీవితాంతం నిరుపేద బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే పని చేశారన్నారు.చివరి క్షణం వరకు ప్రజా క్షేత్రంలో ఉండి సేవ చేసి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల అభిమానాన్ని పొందరన్నారు.  ములాయం సింగ్  కుమారుడు అఖిలేష్ యాదవ్ తో పాటు వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.స్వర్గీయ ఇంద్రన్న తో ములాయం సింగ్ కి ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు.