గద్వాల నడిగడ్డ, ఫిబ్రవరి 24 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మండలం పరిధిలో సంగల, కాకులారం గ్రామాలలో నట్టల నివారణ మందులు శుక్రవారం పంపిణీ చేశారు. నట్టల నివారణ మందులను తాగించడం వలన జీవాలు బలంగా, పుష్టిగా ,ఆరోగ్యంగా ఉండడమే కాకుండ జీవాలకు వ్యాధులు రాకుండా ఉంటాయని గద్వాల మండల పశువైద్యాధికారి కె. శంకరయ్య అన్నారు. 6760 గొర్రెలకు, 850 మేకలకు మొత్తం 7,610 జీవాలకు మందులు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జే వి ఓ మాధవి లత, పశువైద్య సిబ్బంది పనింద్ర రాజు, గొర్రెల సహకార సంఘం సభ్యులు , గొర్రెల కాపరులు తదితరులు పాల్గొన్నారు.
గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ




